ఈవీఎంలపై అభ్యంతరం లేదు


Sun,April 14, 2019 02:52 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : లోక్‌సభ ఎన్నికల పో లింగ్ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌లు పనిచేయని చోట మార్చిన యంత్రాలపై తమకు ఎ లాంటి అభ్యంతరం లేదని రాజకీయ పార్టీల ప్రతినిధులు స్పష్టం చేశారని రిటర్నింగ్ అధికారి శ్రీధర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప లు ప్రాంతాల్లో ఈవీఎం, వీవీప్యాట్‌లు మొరాయించగా ఆయా ప్రాంతాల్లో కొత్త వాటిని అమర్చిన విషయం తెలిసిందే. అయితే మార్పిడి చేసిన యంత్రాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేద ని, అలాగే 17ఎ, 17సి కీబోర్డు డైరీలపై కూడా ఎ లాంటి అభ్యంతరాలు లేవని రాజకీయ పార్టీల ప్ర తినిధులు స్పష్టం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ని ర్వహించిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం గా ముగియడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ పట్ల, ఈవీఎం, వీవీప్యాట్‌లపై తమకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, ఎన్నికల నిర్వాహణ పై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపారని కలెక్టర్ వివరించా రు.

శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ లో లోక్‌సభ ఎన్నికల సాధారణ పరిశీలకులు దినేష్‌ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పోలింగ్‌కు సంబంధించి 17ఎ ప్రిసైడింగ్ అధికారుల డైరీ, 17ఎ స్కూటినీ ఫారం తదితర రికార్డులను జిల్లా కలెక్టర్, జల్లా ఎన్నికల అధికారి, నార్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీధర్ సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు దినేష్‌ప్రసాద్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై అదేవిధంగా ఈవీఎంలు పనిచేయని చోట మార్పిడి యంత్రాలపై, 17ఎ ప్రిసైడింగ్ అధికారుల డైరీ, 17ఎ తదితర ఫారాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయవచ్చని తెలిపారు. టీఆర్‌ఎస్ తరఫున సమావేశానికి హాజరైన ప్రతినిధి ని రంజన్‌రెడ్డి, బీజేపీ తరుపున శ్రీనివాసులు, కాం గ్రెస్ పార్టీ తరుపున హాజరైన రాజులు తమకు పో లింగ్‌పైన కానీ, 17ఎ, 17సి పీవో డైరీపై ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. సమావేశానికి వనపర్తి జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, గద్వాల జిల్లా సహాయ రిటర్నిం గ్ అధికారి, జాయింట్ కలెక్టర్ నిరంజన్, నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటయ్య తదితరులు హాజరయ్యారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...