జాతీయ పార్టీలకు కాలం చెల్లింది


Fri,April 12, 2019 02:09 AM

- విలేకరుల సమావేశంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
కల్వకుర్తి రూరల్ : గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలవనుందని జాతీయ పార్టీల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలలో గతంలో ఉన్నా రికార్డులను బద్దలుకొట్టి టీఆర్‌ఎస్ అభ్యర్ధి భారీ మెజార్టీతో గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పేద జిల్లా, కరువు జిల్లా, వలసల జిల్లాగా పేరున్న ఈ జిల్లాను సీఎం సహకారంతో పాలమూరు - రంగారెడ్డి, కేఎల్‌ఐ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిని చేసి వలసల రహిత జిల్లాగా తీర్చుదిద్దుతామని, కల్వకుర్తి ప్రజలకు అభివృద్ధిని బహుమతిగా ఇస్తామని అన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో నాగర్‌కర్నూల్ జిల్లా రూపురేఖలు మారడంతో పాటు అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఈ ఎన్నిక ల్లో జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని రాబోవు రోజులలో ప్రాంతీయ పార్టీలదే హవా నడవనుందని కేంద్రంలో ఫెడర ల్ ఫ్రంట్ అడుగులు వడివడిగా పడనున్నాయని అన్నారు. 2014 సంవత్సరంలోబీజేపీ ప్రభుత్వం నూతనంగా 29 వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకి కేంద్రం నిధుల పంపిణీ లో వివక్ష ప్రదర్శించిందని కాళేశ్వరం, పాలమూరు రంగారె డ్డి ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వకుండా ఆంధ్రాలోని పోలవరానికి జాతీయహోదా కట్టబెట్టి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిందని విమర్శించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి యాభైవేల మెజార్టీతో పోతుగంటి రాములుని భారీ మెజార్టీతో గెలిపించుకుంటున్నామని అన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి చిత్తరంజన్‌దాసు మాట్లాడుతూ కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయశక్తిగా ఎదగనుందని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు. విలేకరుల సమావేశంలో వైస్ చైర్మన్ షాహేద్, కౌన్సిలర్ సూర్యప్రకాశ్‌రావు, వైస్ ఎంపీపీ పర్వతాలుగౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బాలాజీసింగ్, నాయకులు ఎడ్మసత్యం, షాన్‌వాజ్‌ఖాన్, మనోహర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...