కేంద్రంలో టీఆర్‌ఎస్ కీలకం


Fri,April 12, 2019 02:09 AM

- కాంగ్రెస్...బిజేపీలకు రాష్ట్రంలో ఆదరణ లేదు
- ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారు: ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

తిమ్మాజిపేట : రాబోయో రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్‌ఎస్ పార్టీ కీలకం కానుందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. తిమ్మాజిపేట మండలం సోంత గ్రామం నేరళ్లపల్లిలో గురువారం ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సారు కారు పదహారు నినాదం ప్రజల్లో బలంగా నాటుకపోయిందని, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం తమదేనని అన్నారు. కాంగ్రెస్,బిజేపీ పార్టీలకు రాష్ట్రంలో ఆదరణ కోల్పోయారని, కనీసం గ్రామాల్లో ప్రచారం నిర్వహించుకునే స్థితి వారికి లేదన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందన్నారు. 60 ఏళ్లగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ఐదేళ్లలో ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై వారిప్పటికే స్పష్టత వచ్చిందన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్ భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పడితే రాష్ర్టానికి న్యాయం జరుగుతుందన్నారు. కుల, మత రాజకీయలకు కాలం చెల్లిందని, రెండు జాతీయ పార్టీలను ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జెక్కా రఘునందన్‌రెడ్డి, బైకని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...