16 సీట్లు గెలుస్తున్నం


Fri,April 12, 2019 02:08 AM

- ఢిల్లీ నుంచి అధిక నిధులు తెచ్చి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తాం
- టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పి.రాములు
- ఢీల్లీలో తెలంగాణ సత్తా చాటే తీర్పును ప్రజలు ఇవ్వనున్నారు
- ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకున్నారు
- అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

అచ్చంపేట, నమస్తే తెలంగాణ : ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రాములు అన్నారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి విలేకరుల సమావేశంలో గురువారం మాట్లాడుతూ 16మంది ఎంపీలు గెలిస్తే కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి, కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చుకునేందుకు అవకావం ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడానికి, జాతీయ హోదా సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గద్వాల, మాచర్ల రైల్వేలైన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్రంపై వత్తిడి తెచ్చి సాధించేందుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గువ్వల మాట్లాడుతూ ఓటింగ్ సరళి చూస్తుంటే ఇప్పటికే అచ్చంపేట నుంచి కారు ఢిల్లీకి చేరుకుందన్నారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకున్నారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా రైతు సమితి అధ్యక్షుడు మనోహర్, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ్మగౌడ్, రాజేందర్, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, ఎంపీపీ పర్వతాలు, రైతు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తులసిరాం, భరత్, విష్ణుమూర్తి, వినోద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...