సీఎం కేసీఆర్ మేధాశక్తి..దేశానికి అవసరం


Mon,March 25, 2019 02:57 AM

వంగూరు : సీఎం కేసీఆర్ మేధాశక్తి దేశానికి ఎంతో అవసరమని నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పి.రాములు అన్నారు. అం దుకు 16ఎంపీ స్థానాలు గెలువాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం మండలంలోని కోనేటిపూర్ వీహెచ్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో వంగూరు మండల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అచ్చంపేట ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణ్‌రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాధం, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి హాజరుకాగా.. ఎంపీ అభ్యర్థి రాములు మాట్లాడుతూ.. కార్యకర్తలు ఐకమత్యంతో కలిసి పనిచేసి తనను ఎం పీగా గెలిపించాలని కోరారు. అనంతరం జగన్నాథం మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ 16ఎంపీ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో సీఎం కేసిఆర్ చక్రం తిప్పే అవకాశం వస్తుందని, దీంతో రాష్ర్టానికి అధిక నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అచ్చంపేట నుంచి అత్యధిక మెజార్టీని రాములుకు అందిస్తానని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కశిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సేవలు దేశానికి చాలా అవసరమన్నారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ రావాలంటే టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎడ్మ మాట్లాడారు. సమావేశంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గణేష్‌రావు, మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రైతు సమితి మండల కన్వీనర్ నారాయణరావు, సింగిల్‌విండో చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, కో-అప్షన్ హామీద్, నాయకులు నరేందర్‌రావు, శ్రీపతిరావు, జైపాల్, శ్రీనివాసరావు, అరవింద్‌రెడ్డి, కర్ణాకర్‌రెడ్డి, మధుయాదవ్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...