కందనూలులో గెలుపు టీఆర్‌ఎస్‌దే


Mon,March 25, 2019 02:56 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్(ఎస్సీ) స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తు న్న పోతుగంటి రాములు గెలుపు ఖాయమని, నాలుగు లక్షల మెజార్టీ కోసం కృషి చేస్తున్నామ ని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, ఎంపీ చీఫ్ పో లింగ్ ఏజెంట్ జక్కా రఘునందన్ రెడ్డి తెలిపా రు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ దేశ అభివృద్ధి కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నారన్నారు. మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ స్థాయిలో రాజకీయ పెనుమార్పులు ఉంటాయన్నారు. ఏడు దశాబ్దాల్లో దేశ అభివృద్ధి తిరోగమనం దిశగా సాగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ స్కా ములతో దేశాన్ని భ్రష్టు పట్టిచ్చిందన్నారు. బీ జేపీ హయాంలో కూడా పెద్దనోట్ల రద్దు, నల్లధ నం రప్పించడం, పేదల ఆర్థిక ప్రమాణాల పెం పులాంటి అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ హ యాంలో కూడా రాఫెల్ కుంభకోణం, నీరవ్ మోడీ, విజయ్‌మాల్యాలాంటి వ్యక్తుల ఆర్థిక అ క్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రధాని మోడీ ప్రతిష్ట మసకబారిందన్నారు. గతేడాది జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లాంటి రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ చతికిల పడిందన్నా రు. రామమందిర నిర్మాణం లాంటి సిద్ధాంతాలకు బీజేపీ దూరమైందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు దేశానికి స్పూర్తిగా నిలిచాయన్నారు. ఇలాంటి పథకాలు యూఎన్‌వో కూడా మెచ్చుకుందన్నారు. ఇలాంటి ఎన్నో పథకాలు అమ లు చేసి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారన్నారు.

సీఎం కేసీఆర్ ఫెడర్ ఫ్రంట్‌ను ముందు కు తీసుకెళ్లి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలంటే నాగర్‌కర్నూల్ లోక్‌సభ ఎన్నికల్లోనూ రాములును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఇచ్చిన హామీ మేరకు 4లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు టీఆర్‌ఎస్ ముందుకు సా గుతుందన్నారు. ప్రస్తుతం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ బలోపేతంగా ఉండ టం వల్ల రాములు గెలుపు లాంఛనమే అన్నా రు. గతంలో ఎంపీగా రెండు సార్లు పని చేసిన మల్లు రవి చేసింది శూన్యం అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రాములు గెలిస్తే పాలమూరుకు జా తీయ హోదా, గద్వాల-మాచర్ల రైల్వే లైన్, ప్రా జెక్టులు కేంద్రంగా పర్యాటక ప్రాంత అభివృద్ధి, మూడు జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పాటు అధిక నిధులు మంజూ రు జరుగుతాయన్నారు. సమావేశంలో ఈశ్వర్‌రెడ్డి, హ న్మంత్‌రావు, రమేశ్, రవీంద్రనాథ్‌రెఢ్డి, భా స్కర్‌గౌడ్, నాగేందర్, మాజీ మార్కె ట్ చైర్మన్ వెంకటయ్య, సర్పంచ్‌లు వేణుగోపాల్ గౌడ్, నాగేందర్ గౌడ్, భాస్కర్ గౌడ్, పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...