టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి.. చీఫ్ ఏజెంట్‌గా జక్కా


Mon,March 25, 2019 02:56 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు ముఖ్య ఎన్నికల ఏజెంట్‌గా జక్కా రఘునందన్‌రెడ్డి నియామకమయ్యారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లికి చెందిన జక్కా గత నాలుగేళ్లుగా అసెంబ్లీ పరిధిలో పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తున్నారు. గతంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రాములును ఖరారు చేశారు. దీంతో ఎన్నికల నిర్వహణ ఒక్క అభ్యర్థికే కష్టంగా ఉంటుంది. దీని దృష్ట్యా ఒక ఏజెంట్‌ను నియమించుకునేందుకు ఎన్నికల సంఘం నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ క్రమంలో జక్కా పనితీరు, అనుభవం ఏజెంట్‌గా రాములుకు ఉపకరిస్తుందని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించి జక్కాను ఏజెంట్‌గా నియమించారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కావాల్సిన అనుమతులు, ఇతర వ్యవహారాలను జక్కా కూడా చూసుకొంటున్నారు. కాగా తన నియామకం పట్ల సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి జక్కా కృతజ్ఞతలు తెలిపారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...