అట్టహాసంగా బండలాగుడు పోటీలు


Mon,March 25, 2019 02:56 AM

ఉప్పునుంతల: మండల పరిధిలోని మామిళ్లపల్లి లక్ష్మీనరసింహ్మస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం నిర్వహించిన అంత్రరాష్ట్ర వృషభ రాజముల బండలాగుడు పోటీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పోటిలను తిలకించడానికి వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పోటీలను స్థానిక ఎస్‌ఐ విష్ణు, మండల టీఆర్‌ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, భూపాల్‌రావ్, చంద్రశేఖర్‌రెడ్డి, రవిందర్‌రావ్, సర్పంచ్ కల్పనలు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీలను వివిధ గ్రామాల నుంచి రైతులు వీక్షించేందుకోసం తరలివచ్చారు. గద్వాల జిల్లా ఐజ మండలం తిప్పత్‌రాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఎడ్లు ప్రథమ బహుమతి కింద రూ.40,000, ద్వితీయ బహుమతి గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం ఇటిక్యాలపాడు గ్రామానికి చెందిన వెంకట్‌రాములు ఎడ్లు రూ.30,000, మూడవ బహుమతి గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం రాలచోడు గ్రామానికి చెందిన ఎండి మౌలాలు ఎడ్లు రూ.20,000, అదేవిధంగా నాల్గవ బహుమతి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌యాదవ్ ఎడ్లు రూ.10,000 గెలుపొందాయి. ఎద్దుల యాజమానులను బహుమతులు, నగదును అందచేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామస్వామిగౌడ్, ఉపసర్పంచ్ మోహన్‌గౌడ్, మాజీ సర్పంచ్ దామోదర్, ఉప్పరిపల్లి సర్పంచ్ అనంతా ఇంద్రాసేనారెడ్డి, ఎంపీపీ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...