బాజీపూర్‌లో కాంగ్రెస్ ఖాళీ


Mon,March 25, 2019 02:56 AM

తిమ్మాజిపేట : మండలంలోని బాజీపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. ఆదివారం రాత్రి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో సుమారు 200 మంది పార్టీలో చేరారు. గ్రామ సర్పంచ్ బొందయ్య, ఉపసర్పంచ్ మంగమ్మ, వార్డు సభ్యులు మల్లయ్యగౌడ్‌తో పాటు యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. వారికి గులాబీ కండువాలు వేసి స్వాగతం పలికారు. కేసీఆర్ రాష్ట్రంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రవింద్రనాథ్‌రెడ్డి, ఎంపీపీ జయలక్ష్మి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌గౌడ్, సీనియర్ నాయకులు వెంకటేష్, రాందేవ్‌రెడ్డి, ఆయూబ్‌ఖాన్, బాలస్వామి, పాండురంగారెడ్డి, సత్యంయాదవ్, నాగేందర్‌గౌడ్ పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...