ప్రాజెక్టులు పూర్తి చేసి నా బాధ్యత నెరవేరుస్తా


Sun,March 24, 2019 01:06 AM

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రాజెక్టులు పూర్తి చేసి నా బాధ్యత నెరువేరస్తానని నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు అ న్నారు. గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తాను కలిసి రామకృష్ణుల్లా అభివృద్ధి పరుస్తామని హా మీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యం లో శనివారం మల్దకల్ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తను సొంత అన్నదమ్ముల్లా చూసుకుంటానని, తన కులం టీఆర్‌ఎస్ కార్యకర్తల కులమని ఎంపీ అభ్యర్థి రాములు అన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది గొప్పగొప్ప నాయకుల పరిచయాలు పొందానని, దీంతో ఎంపీగా గెలిచిన అనంతరం పాలమూరు అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తానన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న గద్వాల-మాచర్ల రైల్వే లైన్‌ను ఐదేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతానన్నారు. గద్వాల, అలంపూర్ ప్రాంతాలకు రావల్సిన నీటి పారుదల ప్రాజెక్టులు తర్వతగతిన పూర్తయ్యేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఎంపీగా ఎంత మెజార్టీతో గెలిపిస్తే అంత శక్తివంతంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

గట్టు కల నెరవేరబోతుంది : బండ్ల
ఎన్నో ఏళ్లుగా గట్టు ప్రజలు ఎదురుచూస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. 15 టీఎంసీల కెపాసిటీతో కృష్ణా, తుంగభద్ర నదులు కలిసే చోటు వరకు సాగునీరు అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన నమూనా చిత్రా లు కూడా తయారు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో గద్వాల తరుపున భారీ మెజార్టీని సాధించి సీఎం కేసీఆర్‌కు బహుమతిని అందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఫెడరల్ ప్రంట్‌ది కీలకపాత్ర : అబ్రహం
16 ఎంపీ స్థానాలను గెలిపించుకుంటే కేంద్రంలో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఫెడరల్ ప్రంట్ కీలక పాత్ర పోషిస్తుందని, అలంపూర్ ఎమ్మెల్యే డా.వీఎం అబ్రహం పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త యుద్ద సైనికుల్లా పని చేయాల్సిన అవసరముందన్నారు. జిల్లా తరుపున లక్ష మెజార్టీని అందించాలని పిలుపునిచ్చారు.

బంగ్లా రాజకీయాలు నమ్మొద్దు : జెడ్పీ చైర్మన్
గద్వాలలో జరుగుతున్న బంగ్లా రాజకీయాలను నమ్మి మోసపోవద్దని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. బీజేపీలోకి డీకే అరుణ చేరిక జరగంగానే సమరసింహారెడ్డి గద్వాలలో మోసపూరిత రాజకీయా లకు తెరలేపాడని మండిపడ్డారు. గద్వాల ప్రజలను అమాయకులను చేసి బావ మరదళ్లు ఆడుకుంటున్నా రని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు డీకే అరుణను నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డున పడి దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఈ ఎంపీ ఎన్నికలతో డీకే కుటుంబం రాజకీయాలకు పూర్తిగా స్వస్థి పలికేలా ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రాములను అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

గట్టు నుంచి అధిక మెజార్టీ సాధిస్తాం..
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో చేసిన సవాల్‌లో ఓడిపోయానని రాష్ట్ర కంజూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప అన్నారు. కాని ఈ సారి ఎంపీ ఎన్నికల్లో అన్ని మండలాల కంటే గట్టు నుంచి అధిక మెజార్టీ సాధింస్తానని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 1.50లక్షల వాల్మీకుల ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌కే అని స్పష్టం చేశారు. అంతకముందు అయిజ, అ లంపూర్‌లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంపీ అభ్యర్థి రాములు ప్రచార రథాన్ని ప్రారంభించి కార్యకర్తల్లో ఉత్సాహన్ని పెంచారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నాగరదొడ్డి వెంకటరాములు, తిరుమలరెడ్డి, సర్పంచ్ యాకూబ్, ఎంపీపీ సవారమ్మ, వైస్ ఎంపీపీ విజయ్, టీఆర్‌ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, ప్రహ్లదరావు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...