రాములుకు భారీ మెజార్టీ అందిద్దాం


Sun,March 24, 2019 01:05 AM

వీపనగండ్ల : పార్లమెంట్ ఎ న్నికల్లో నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పి.రాములుకు ఓటు వేసి భారీ మెజార్టీ ని అందించాలని మాజీ మం త్రి జూపల్లి కృష్ణారావు తెలిపా రు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమ లు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మండలంలోని సం గినేనిపల్లి గ్రామంలో టీ డీపీ మాజీ మండలాధ్యక్షుడు వి జ య భాస్కర్ రెడ్డి, ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడు ఇంద్రకంటి వెంకటేష్‌ల ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన దాదాపు 60 మంది నాయకులు, కార్యకర్తలు జూపల్లి సమక్షంలో శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జూ పల్లి కృష్ణారావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఏర్పడిన తరువాత కొల్లాపూర్ నియోజకవర్గం కోసం దాదాపుగా రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేసి గ్రామాలాభివృద్ధి కోసం నా వంతు ప్రయత్నం చేశానన్నారు. దాదాపుగా రూ.600 కోట్లు విలువ చేసే తారురోడ్లు వేయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా సంగినేనిపల్లికి రూ.2 కోట్లతో సీసీ రోడ్ల కోసం నిధు లు మంజూ రు చేయడం జరిగిందన్నారు. ఎంజీకేఎల్‌ఐ ద్వారా సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు అనుసంధానం చేయడం కోసం జీవోను విడుదల చేశామన్నారు. తాగు, సాగునీటికి శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే ఎంజీకేఎల్ ఐ ద్వారా 25 టీఎంసీల నీటి నిల్వ కోసం కొత్త రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పథకం, కేసీఆర్ కిట్, మిష న్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నందువల్లే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో వీపనగండ్ల సర్పంచ్ నరసింహా రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కమలేశ్వర్ రావు, బాల్ రెడ్డి, గోవింద్ గౌడ్, నారాయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గంగిరెడ్డి, రవీందర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, వీరయ్య, రాంరెడ్డి, చెన్నారెడ్డి, రాములు, కోటిరెడ్డి, తిరుపతయ్య పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...