ముగిసిన కందూరు బ్రహ్మోత్సవాలు


Sun,March 24, 2019 01:05 AM

అడ్డాకుల : దక్షిణ కాళీగా పేరుగాంచిన కందూరు రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ఉదయం స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ప్రారంభంలో పూజలు చేసిన కళాశాలలోని నీటిని కోనేటిలో వదిలారు. కందూరు గ్రామం నుంచి కొత్త కుండలలో రంగు నీళ్లు తీసుకుని ఊరేగింపుగా వచ్చి దేవాలయం ప్రాంగణంలోని ఉత్సవ విగ్రహాలపై రంగు నీటిని పోసి విగ్రహాలను, త్రిశూలాన్ని కోనేరులోని కృష్ణా నీటితో స్నానం చేయించి ఉత్సవాలకు ముగింపు పలికారు. ఆదివారం నుంచి కందూరు జాతర ప్రారంభమవుతుంది. కందూరు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కందూరులో శనివారం హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. బ్రహ్మోత్సవాల చివరి రోజైన శనివారం తీర్థావళి ముగిసిన తర్వాత ప్రజలంతా హోలీ సంబురాలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కందూరు సర్పంచ్ శ్రీకాంత్, ఈవో నర్సింహులు, అనంత శర్మ, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రమేశ్ గౌడ్, చల్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నరేందరా చారి, ప్రజలు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...