సిబ్బందికి రవాణా ప్రణాళిక రూపొందించాలి


Sun,March 24, 2019 01:05 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : జిల్లా లో లోక్‌సభ ఎన్నికల విధు ల నిర్వాహణకు గద్వాల, అ లంపూర్, వనపర్తి, మహబూబ్‌నగర్ తదితర ప్రాం తాల నుంచి సిబ్బంది వస్తున్నందున అందుకు తగ్గట్టు గా రవాణా ఏర్పాట్లు చేయాలని ట్రాన్స్‌పోర్టు కమిటీ నో డల్ అధికారులను కలెక్టర్, ఎన్నికల అధికారి శ్రీధర్ ఆదేశించారు. శనివారం క లెక్టరేట్ చాంబర్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నాగర్‌కర్నూల్, వనపర్తి, గ ద్వాల జిల్లాల వివిధ నోడల్ కమిటీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సందర్భంగా 9,265 మంది పోలింగ్ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. సిబ్బంది పూర్తి వివరాలను ముందుగానే సేకరించి, రిసెప్షన్ కేంద్రం వద్ద బస్టాండ్లు, బస్ డిపోల వద్ద మార్కు చేసిన విధంగా ఏ ప్రాంతాలకు బస్సులు వెళ్లే విషయాలకు సంబంధించిన బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులుగా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలని, ఇతర పోలింగ్ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించినా సరిపోతుందన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏ ర్పాట్లు ముం దుగానే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గాను ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని ఇన్‌చార్జిగా నియమించటం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుం డా అమలు చేయాలని, ప్రతిరోజు అన్ని జిల్లాల ఎంసీసీ కమిటీలు నివేదికలు ప ంపించాలని, వీటి ఆధారంగా కన్సాలిడేటెడ్ నివేదికను ఎన్నికల సంఘానికి పంపి ంచడం జరుగుతుందన్నారు. ఫ్లయింగ్ స్కాడ్లు, ఎస్‌ఎస్‌టి, వీడియో సర్వేలెన్స్ బృందాలు ఎళ్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల నోడల్ అధికారులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...