జాతీయ పార్టీల.. డిపాజిట్లు గల్లంతు


Sat,March 23, 2019 02:39 AM

- అందుబాటులో సాగునీరున్నా.. రైతులకు అందించడంలో విఫలం
- ఇంతకాలం రైతుల గురించి ఎందుకు పట్టించుకోలేదు
- టీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీ అయినా.. జాతి ప్రయోజనాల్లో ఏ పార్టీ సరితూగలేవు
- పోతుగంటి రాములును భారీ మెజార్టీతో గెలిపించుకుందాం
- పాలమూరు-రంగారెడ్డితో మారనున్న భవిష్యత్తు
- ముఖ్య కార్యకర్తల సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్ టౌన్ : జాతీయ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని, 70 ఏళ్లు పరిపాలించినా.. వారికి జాతి ప్రయోజనాలు పట్టలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పార్లమెంట్ స్థానానికి పోతుగంటి రాములుతో నామినేషన్ వేయించిన అనంతరం స్థానిక సాయి గార్డెన్స్‌లో ఎమ్మెల్యే మ ర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ.. 70 సంవత్సరాలుగా 70వేల టీఎంసీల నీళ్లు అందుబాటు లో ఉన్నా.. సాగునీరు రైతులకు అందించడంలో విఫలమయ్యారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధుపథకాన్ని ప్రవేశపెడితే దానిని కాఫీ కొట్టి రైతులకు సాయం చేయడానికి ముందకొస్తుందన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలని, టీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీ అయినా ఆలోచనలో, జాతి ప్రయోజనాల విషయంలో ఆ పార్టీలు టీఆర్‌ఎస్‌కు సరి తూగవని, టీఆర్‌ఎస్ గెలుపు చారిత్రక అవసరం అన్నారు. రాష్ట్రంలో 5 ఎకరాల రైతుకు రైతుబంధు, పింఛనుకు కలిపి ఏడాదికి రూ.74వేలు ఇస్తుండగా.. ఇదే పథకాన్ని కాఫీ కొట్టి కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ కింద ఇచ్చేది కేవలం ఏడాది రూ.6 వేలు మాత్రమేనన్నారు.

పాలమూరు-రంగారెడ్డితో మార్పు..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర భవిష్యత్తే మారుతుందని, సీఎం కేసీఆర్ ఊహించిన విధంగా బంగారు తెలంగాణ సాధించుకోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని 29రాష్ర్టాల్లో అత్యధిక ఆదాయం కేంద్రానికి ఇచ్చే 5,6 రాష్టాల్లో తెలంగాణ ఒకటన్నారు. కేంద్రంలో మన చక్రం తిప్పే పరిస్థితి ఉంటేనే రాష్ర్టానికి నిధులు అత్యధికంగా తెచ్చుకోవచ్చన్నారు. అందకే 16 ఎంపీ సీట్లు గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్ హయాంలోనే నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాలు అయ్యాయన్నారు. బంగారులాంటి నల్లరేగడి భూములున్న అలంపూర్‌ను సమైక్య రాష్ట్రంలో ఎండబెట్టారన్నారు. తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాల్లో నడిగడ్డ సస్యశ్యామలం కానుందన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలుపొంచుకుందామని, ఇది కార్యకర్తలు, నాయకుల కృషితోనే సాధ్యమవుతుందన్నారు.

స్థానికుడి వల్లే అభివృద్ధి సాధ్యం : మంద
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి స్థానికుడిని గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం అన్నారు. స్థానికుడైన పోతుగంటి రాములుకు ప్రాధాన్యతనిచ్చి సీఎం కేసీఆర్ ఎంపిక చేశారని, భారీ మెజార్టీతో గెలుపించుకోవాలని పిలుపునిచ్చారు.

75వేల ఓట్ల మెజార్టీయే టార్గెట్ : మర్రి
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి సీఎం కేసీఆర్ 75వేల మెజార్టీని టార్గెట్ పెట్టాలరని, ఆ దిశగా నియోజకవర్గంలో సమన్వయంతో పనిచేసి భారీ మెజార్టీతో రాములును గెలుపిస్తామని ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా 16 సీట్ల గెలుపించుకోవడం ఖాయమని, నాగర్‌కర్నూల్ స్థానాన్ని అన్నింటికంటే అత్యధిక మెజార్టీతో గెలుపించుకొని కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇద్దమన్నారు. మాచర్ల-గద్వాల రైల్వేలైన్ కావాలంటే రాములును గెలిపించు కోవాలన్నారు.

అభివృద్ధిలో శభాష్ అనిపించుకుంటా : టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రాములు
కేసీఆర్ తనపై నమ్మకంతో ఎంపీ స్థానానికి టికెట్ కేటాయించారని, గెలిచిన తర్వాత పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేసి శభాష్ అనిపించుకుంటానని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు అన్నారు. తనను అభ్యర్థిత్వానికి మద్ధతు తెలిపిన ఏడు నియోజకవర్గాల శాసన సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, స్థానికుడిగా అన్ని సమస్యలు తనకు తెలుసని, అందరిని కలుపుకొని అభివృద్ధి సాధిద్దామని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

రాములు శాంత స్వరూపులు : ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉన్న పోతుగంటి రాములు శాంత స్వరూపులని, అలాంటి వ్యక్తి మా నియోజకవర్గం వాసి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీల డిపాజిట్లు గల్లంతు చేసి మూడు లక్షల మెజార్టీతో రాములును గెలిపించుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు.

స్థానికుడికి అవకాశం రావడం అదృష్టం : గువ్వల బాలరాజు
పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు మా నియోజకవర్గానికి చెందిన నాయకుడికి అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని భారీ మెజార్టీతో గెలుపించుకుందామని పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్‌లో నూతన జోష్ : అబ్రహం
కారు, సర్కారు, కేసీఆర్ నినాదంతో పనిచేసి రాములను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని అలంపూర్ ఎమ్మెల్యే డా.అబ్రహం అన్నారు. టీఆర్‌ఎస్ ప్రస్తుతం మంచి జోష్‌తో ఉందని, కాం గ్రెస్, బీజేపీలు గెలుపుపై ఆశలు లేకుండా ఉన్నాయని జోస్యం చెప్పారు. దేశాన్ని శాసించేస్థాయికి టీఆర్‌ఎస్ ఎదుగుతుందన్నారు.

భారీ మెజార్టీ ఇద్దాం : జెడ్పీ చైర్మన్
సమన్వయంతో పనిచేసి రాములును భారీ మెజార్టీతో గెలుపించుకుంటే అభివృద్ధి కూడా అదేస్థాయిలో చేసుకోవచ్చని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. ఎమ్మెల్యేలు ప్రచారంలో ముందుండి అభివృద్ధి తెలియజేస్తూ ఓటును అభ్యర్థించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకంటే అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్ స్థానానికి అత్యధిక మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పథకాలే అండ : బండ్ల
ప్రతి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో రాములును గెలిపించుకుందామని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కోరారు. ప్రభుత్వ పథకాలే మెజార్టీ వచ్చేలా చేస్తాయని, వాటిని ప్రచా రం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంత కు ముందు పార్లమెంట్ స్థానం నుంచి నామినేషన్ వేసిన రాములు, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రె డ్డి, అబ్రహం, జైపాల్‌యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బండారు భాస్కర్ తదితరులను మర్రి జనార్దన్‌రెడ్డి శాలువాతో సత్కరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్‌యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ విజితారెడ్డి, ఎంపీపీ జయలక్ష్మి, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...