ప్రచారం షురూ..


Sat,March 23, 2019 02:39 AM

- రాములును భారీ మెజార్టీతో గెలిపిద్దాం
- ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
- నాగర్‌కర్నూల్ మండలం పుల్జాల నుంచి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రచారం ప్రారంభం
నాగర్‌కర్నూల్ రూరల్ : నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాములు ప్రచారం నాగర్‌కర్నూల్ మండలంలోని పుల్జాల గ్రామం నుంచి శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి రాములు ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ఉండాలని కేసీఆర్ ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో 16 సీట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించుకోవాల్సి ఉందన్నారు. ప్రజలు కారు గుర్తుకే ఓటు వేసి రాములును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనవాస్‌యాదవ్, రాష్ట్ర నాయకుడు జక్కారఘునందన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...