నారాయణపూర్ తండాలో ఘనంగా హోలీ పండుగ


Sat,March 23, 2019 02:38 AM

- పాల్గొన్న టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత గోళి శ్రీనివాస్‌రెడ్డి
వెల్దండ : మండల పరిధిలోని నారాయణ పూర్ తండా లో శుక్రవారం గిరిజనులు తమ సంస్కృతి, సాంప్రదాయ పద్దతిలో హోళి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి పదేళ్లకోసారి గిరిజనులు తమ సాంప్రదాయ పద్ధతిలో గ్రామ ప్రజలంతా కలిసి హోలీ పండుగ సంబురాలు జరుపుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న తండా గిరిజనులు పండుగకు వచ్చి కలిసి మెలిసి హోలీ పండుగలో పాల్గొంటారని తెలిపారు. వేడుకలకు టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై తండావాసులతో హోలీ ఆడారు. యువతీ, యువకులు, రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తమ ఆరాధ్య దైవానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజీనాయక్, నాయకులు శ్రీనునాయక్, తారాసింగ్, బద్యా, లచ్చిరాం, గోపి, లక్ష్మిపతి, కృష్ణ, తదితరులు ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...