విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మరొకరు


Fri,March 22, 2019 02:35 AM

వనపర్తి టౌన్ : అతివేగంగా వాహనం నడిపి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వనపర్తి పట్టణ ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల మేరకు.. వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన కురుమూర్తి వృత్తిరీత్యా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పాత బజారుకు చెందిన శేఖర్‌రెడ్డి తన వాహనాన్ని నడిపేందుకు బుధవారం కురుమయ్యను తీసుకెళ్లాడు. ఫంక్షన్ లేట్ కావడంతో రాత్రి వేళలో యజమాని శేఖర్‌రెడ్డిని ఇంటి దగ్గర వదిలి తాను ఇంటికి వెళ్లేందుకు పెబ్బేర్ రహదారి వైపు కారులో వెళ్లాడు. మద్యం మత్తులో వేగంగా వాహనాన్ని నడపడంతో ఆర్డీవో ఆఫీస్‌కు వెళ్లే ప్రధాన ద్వారం ముందున్న టెలిఫోన్ డబ్బాను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొని గాలిలో రెండు పల్టీలు కొట్టడంతో కురుమయ్య అక్కడిక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనతో విద్యుత్ స్తంభం నేలకొరగడంతో పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేసి గంటలోపు విద్యుత్‌ను పునరుద్ధరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోనుంచి కురుమయ్య మృతదేహాన్ని వెలికి తీసి ప్రాంతీయ దవాఖానకు తరలించారు. పోస్ట్‌మార్డం అనంతరం కుటుంబ సభ్యులకు కురుమయ్య మృతదేహాన్ని అప్పగించారు.
కాగా గతంలోనే పలుమార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కురుమయ్య పట్టుబడటంతో ఫైన్ వేసినట్లు పట్టణ వాసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై నరేందర్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...