కనుల పండువగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం


Fri,March 22, 2019 02:31 AM

-స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఉప్పునుంతల : మండల పరిధిలోని మామిళ్లపల్లి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కనుల పండువ గా జరిగింది. వేద పండుతులైన బ్రా హ్మనోత్తముల మంత్రోచ్ఛరణలతో, సన్నాయి వాయిద్యాలతో స్వామి వారి కల్యాణ క్రతువు శాస్త్రోయుక్తంగా జరిపించారు. లక్ష్మీ నరసింహుని కల్యాణోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఇన్‌చార్జి ఈవో శ్రీనివాస రావు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ చలమో ల రామస్వామిగౌ డ్, స్థానిక సర్పంచ్ కడారి కల్పన, ఎ ంపీటీసీ లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ మో హన్‌గౌడ్, మాజీ స ర్పంచ్ దామోదర్‌లు స్వామివారి కల్యాణ క్రతువులో పాల్గొన్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కల్యాణ కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్ రావు, అచ్చంపేట రైతు సమన్వయ సమితి చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు బాలయ్య, నాగయ్యగౌడ్, దాసర్లపల్లి మాజీ సర్పంచ్ ఎల్లయ్య, తదితర ప్రముఖులు స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...