ప్రతిపక్ష పార్టీలు కనుమరుగు


Thu,March 21, 2019 01:48 AM

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ: జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు అయ్యే పరిస్థితులు వచ్చాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కాగడ పెట్టి వెలికినా కనిపించవని ఆయన జోస్యం చెప్పారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదైతే..ప్రతిపక్ష హోదాను కూడా సాధించుకోలేని దుస్థితి బీజేపీ పార్టీదని జైపాల్‌యాదవ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలు, ప్రజల కొరకు అహర్నిషలు శ్రమిస్తున్న కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాదిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించడం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి దాగి ఉందని జైపాల్‌యాదవ్ వివరించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజక అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని, ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా రాజకీయం కోసం తహతహలాడుతుందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడానికి ఎమ్మెల్యేలు తక్కువయ్యారని, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారా..అంటే ఆది లేదు. మరి ఏ ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తుంది అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాల్సిన అవసరం టీఆర్‌ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి అసలు అవసరం లేదని జైపాల్‌యాదవ్ ఉద్ఘాటించారు.

కాంగ్రెస్ పార్టీ దివాళకోరుతనం, రోజు రోజుకు ఉనికి కోల్పోతున్న వైనాన్ని చూసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కేవలం అభివృద్ధి కాంక్షిస్తూ టీఆర్‌ఎస్ వైపు అడుగులు వేస్తున్న విషయాన్ని మతి చెడిన కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని జైపాల్‌యాదవ్ హితవు పలికారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు చేసిందేమి లేదని మండిపడ్డారు. కొత్తగా రాష్ట్రం ఏర్పాటైతే.. ఆ రాష్టాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా, ముఖ్యమంత్రి చేసిన వినతులను పక్కన బెట్టి రాజ్యాంగాన్ని అపహస్యం చేసిందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ దుయ్యబట్టారు. కేంద్రం సహకరించకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్ష వల్ల కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయని వివరించారు. తెలంగాణపథకాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు అమలు చేస్తున్న విషయాలను గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని, మరోక స్థానంలో మిత్రపక్షమైన ఎంఐఎం అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలకు కేసీఆర్ చాల అవసరం అని, దేశం యొక్క భవిషత్తు, దిశ, దశ మార్చే శక్తి కేసీఆర్‌కు పుష్కలంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో ఫెడరల్ ఫ్రంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, కేసీఆర్ ప్రధాని అయ్యే గడియలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు.

22న నామినేషన్
ఈ నెల 22న నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు నాగర్‌కర్నూల్‌కు తరలిరావాలని జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు. సమావేశంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం, వైస్ చైర్మన్ షాహెద్, వైస్ ఎంపీపీలు పర్వతాలు, వెంకటయ్య, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎడ్మ సత్యం, కౌన్సిలర్ సూర్యప్రకాశ్‌రావు, మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, శ్రీధర్, లాలూ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...