సబ్జెక్టు ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా .. వ్యవహరించొద్దు


Thu,March 21, 2019 01:48 AM

- జిల్లా విద్యాధికారి గోవిందరాజులు
- పది ఇంగ్లీష్-1 పరీక్షకు 44మంది గైర్హాజరు

నాగర్‌కర్నూల్ టౌన్ : పదో తరగతి పరీక్షల్లో ఆయా రోజున జరిగే సబ్జెక్టు పరీక్షలకు ఆయా సబ్జెక్టుకు సంబంధించిన ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించరాదని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు సూచించారు. బుధవారం నిర్వహించిన ఇంగ్లీష్ మొ దటి పేపర్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 10,808 మంది విద్యార్థులకు గానూ 10,773మంది విద్యార్థులు హాజరుకాగా, 35మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. అదేవిధంగా రెండు ప్రై వేట్ సెంటర్లలో వివిధ సబ్జెక్టుల్లో ఫెయి ల్ అయిన 53మందికి గానూ 44 మంది హాజరుకాగా 9మంది విద్యార్థు లు గైర్హాజరైనట్లు వివరించారు. జిల్లా లో జరిగిన పది పరీక్షా ఇంగ్లీష్-1 పరీక్షా సెంటర్లను డీఈవో కొల్లాపూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గాంధీ మెమోరియల్ హైస్కూల్, సత్యసాయి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో నాలుగు కేంద్రా లు, పెంట్లవెల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బా లుర ఉన్నత పాఠశాలలో రెండు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. డీఈవో ఆరు కేంద్రాలను, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు 20పరీక్షా కేంద్రాలను సందర్శించారు. అంతకుముందు ఉదయం 8గంటలకు డీఈవో గోవిందరాజులు చీఫ్ సూపరింటిండెంట్, డిపార్ట్‌మెంట్ అధికారులతో సెట్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించి పరీక్షా నిర్వాహణ అంశాలపై చ ర్చించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎవరు సెల్‌ఫోన్లు తీసుకురావద్దని, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఇన్విజిలేటర్లు గా విధులు నిర్వహిస్తున్న సబ్జెక్టు ఉ పాధ్యాయులు ఆరోజు జరిగే ఆ స బ్జెకు పరీక్ష విధులకు హాజరుకాకుం డా చూడాలని ఆదేశించారు. చూచిరాతలకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా నో డల్ అధికారి కుర్మయ్య, ఎంఈవోలు చంద్రశేఖర్‌రెడ్డి, కార్యాలయ సిబ్బంది శివశంకర్, వెంకట్ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...