ఉపాధ్యాయులకు ఎన్నికల.. ఉత్తర్వులను అందించండి


Thu,March 21, 2019 01:47 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : ఉపాధ్యాయులకు ఎన్నికల ఉత్తర్వులను అందించాలని పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని ఎంఈవోలు తమత మ మండలాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పార్లమెం ట్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఉత్తర్వులను సీఆర్‌పీల ద్వారా అందించాలన్నారు. అక్నాలెడ్జెంట్ తీసుకొని ఈనెల 22వ తేదీ సాయంత్రానికి జిల్లా కలెక్టర్లకు సమర్పించాలని ఎంఈవోలను ఆదేశించారు. అదేవిధంగా ఎన్నికల విధుల్లో పా ల్గొనే ఉపాధ్యాయులు తప్పనిసరీగా తమ సొంత నియోజకవర్గంలో పనిచేస్తున్నట్లయి తే ఫామ్ 12ఏ, ఇతర నియోజకవర్గంలో పనిచేస్తున్నట్లయితే ఫామ్ 12తో పాటు ఎన్నికల ఉత్తర్వులు, ఓటరు ఐడీ కార్డును జతపరిచి ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నేరుగా తమ మండల విద్యాధికారికి ఉపాధ్యాయులు సమర్పించాలన్నారు. అదే నియోజకవర్గంలో పనిచేసే ఉద్యోగస్తులు అంటే ఫామ్ 12ఏ సమర్పించినవారు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రాల్లో అ యినా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని, ఉద్యోగులంతా 100శాతం పో స్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని, భారత రా జ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రథమ కార్తవ్యంగా భావించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీధర్ సూచించారు.

30 నుంచి సమెటీవ్ అసైన్మెంట్-II పరీక్షలు : డీఈవో
నాగర్‌కర్నూల్ టౌన్ : జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలైన కేజీబీవీ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్, ప్రైవేట్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఈనెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు సమెటీవ్ అసైన్మెంట్-II పరీక్షలు(వార్షిక పరీక్షలు) నిర్వహించాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా పత్రాలను ఈనెల 22వ తేదీ నుంచి సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయం నుంచి పొందాలన్నారు. పరీక్షల నిర్వాహణకు అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...