పది పరీక్షకు 41మంది విద్యార్థుల గైర్హాజరు


Wed,March 20, 2019 02:01 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని జి ల్లా విద్యాధికారి గోవిందరాజులు కోరా రు. మంగళవారం నిర్వహించిన హిం దీ మొదటి పేపర్ పరీక్షకు జిల్లా వ్యా ప్తంగా 10,808మంది విద్యార్థులకు గానూ 10,772మంది విద్యార్థులు హా జరు కాగా 36మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో తెలిపారు. అదేవిధంగా రెండు ప్రైవేట్ సెంటర్లలో 22 మంది విద్యార్థులకు గానూ 17మంది హాజరు కాగా, 5మంది విద్యార్థులు పరీక్షలకు హాజరులేదు. జిల్లాలో మంగళవారం జరిగిన పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాధికారి గోవిందరాజులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్న త పాఠశాల, గీతాంజలి హైస్కూల్, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, బిజినేపల్లిలోని రెండు పరీక్షా కేంద్రాలు, తిమ్మాజిపేటలో రెండు కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. కాగా డీఈవో 8 కేంద్రాలను, ప్లయింగ్ స్కాడ్ బృందాలు 24 కేంద్రాలను, సందర్శించారు. ఉదయం జిల్లా విద్యాధికారి గోవింరాజులు అం దరు చీఫ్ సూపరింటిండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పదో తరగతి నిర్వాహణ అంశాలపై చర్చించారు. పరీక్షలు పడక్బందీగా నిర్వహించాలని, చూచిరాతలకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశా లు జారీ చేశారు. కార్యక్రమంలో పరీక్షల నిర్వాహణ అధికారి రాజశేఖర్‌రా వు, ఎంఈవోలు చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చంద్రుడు, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ప్రసాద్‌గౌడ్, కార్యాలయ సిబ్బం ది శివకుమార్, వెంకట్ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...