ఎన్నికల ఖర్చుల వివరాలను అందించాలి


Wed,March 20, 2019 02:01 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుపుతున్న సాధన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా అందించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏకే. మోరియా ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఫ్లయింగ్ స్కాడ్, వీడియో సర్వేలెన్స్, వీడియో వ్యూ, టీమ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రతి ఖర్చును వీడియో రికార్డుల ద్వారా సేకరించాలని, సేకరించిన సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలన్నారు. ఎన్నికల విధుల్లో సిబ్బంది అలసత్వం ప్రదర్శించరాదని, అలసత్వం ప్రదర్శించిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. క్షేత్ర స్థాయిలో అభ్యర్థులు బహిరంగ సమావేశాలను నిర్వహించేటప్పుడు సమావేశాలకు నిర్వహించే వ్యయాలపై నిఘా ఉంచాలని క్షేత్ర స్థాయిలో పర్యటించే టీమ్‌లను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే మద్యం, డబ్బు పంపిణీ ఇతరాత్ర వ్యవహారాలపై గట్టి నిఘా ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత అధికారులకు వెంటనే చేరవేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో సమయపాలన పాటిస్తూ అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని టీమ్‌ల ప్రతినిధులను సూచించారు. సమావేశంలో ఎక్స్‌పండించర్ జిల్లా నోడల్ అధికారి నూతనకంటి వెంకట్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, నోడల్ అధికారి అనిల్‌ప్రకాశ్, హనుమానాయక్ పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...