టోల్‌ఫ్రీ నెంబర్1950కి500 ఫోన్‌కాల్స్


Wed,March 20, 2019 02:01 AM

-ఇద్దరు నోడల్ అధికారుల నియామకం
-టోల్‌ఫ్రీ కేంద్రం 24 గంటలు పనిచేస్తుంది
-ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శ్రీధర్
నాగర్‌కర్నూల్ టౌన్ : ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు, ముఖ్యంగా ఓటర్లకు తెలియజేసేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఇప్పటి వరకు సుమారు 500 ఫోన్‌కాల్స్ వచ్చాయని జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సమాచారాన్ని తెలుసుకునేందుకు గాను కలెక్టర్ కార్యాలయంలో 1950 టోల్‌ఫ్రీ నంబర్, కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రంలో 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌తోపాటు 08540-230201, 230202, 230204 నంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రం 24గంటలు పనిచేసేలా ఇద్దరు నోడల్ అధికారులతో పాటు, సిబ్బందిని నియమించామని తెలిపారు. షిఫ్ట్ పద్ధతిలో సిబ్బంది విధులు నిర్వహిస్తూ 1950 కాల్ సెంటర్‌కు వచ్చే కాల్స్ అన్నింటిని స్వీకరించడం జరుగుతుందన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం, ఓటరు గుర్తింపుకార్డు, ఓటరు జాబితాలో ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రం వివరాలు, vwఎల్‌వో, ఈఆర్వో తదితర వివరాలన్నీ ఈ టోల్‌ఫ్రీ నెంబర్ 1950కి ఫోన్ రావడం జరుగుతుందన్నారు. సిబ్బందికి వివరాలు తెలియజేస్తే తక్షణమే వారు కోరిన సమాచారాన్ని అందించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్ట్రం చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్‌కు వచ్చే కాల్స్‌ను రికార్డు చేయడం జరుగుతుందన్నారు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఎన్నికల సమాచారంతో పాటు ఓటర్ల స్పందన, ఓటర్లు ఇచ్చే సలహాలు, సూచనలు అంతేగాక ఫిర్యాదులను కూడా స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. కాల్ సెంటర్ అన్ని పనిదినాల్లో ఉదయం 9గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందన్నారు. అందువల్ల జిల్లాలోని ప్రజలందరూ ముఖ్యంగా ఓటర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ సేవలను వినియోగించుకొని ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారం, సమస్యలు కానీ ఉంటే 1950కి ఫోన్ చేయాలని ఆయన కోరారు. కొత్త ఓటరుగా నమోదుకు కావాల్సిన ధ్రువపత్రాలు, ఇతర వివరాలు, అలాగే ఓటరు జాబితాలో ఓటు ఉందోలేదో అనే అంశంపై ఎక్కువగా ఫోన్‌కాల్స్ వచ్చిట్లు కలెక్టర్ తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...