పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా.. నిర్వహించాలి


Wed,March 20, 2019 02:01 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి అందరూ కృషి చేయడంతో పాటు ఫ్లయింగ్ స్కాడ్, ఎస్‌ఎస్‌టీ బృందాలు పకడ్బందీగా దాడులు నిర్వహించాలని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు, 2012 ఐఆర్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రవణ్‌రామ్ కలెక్టర్‌కు సూచించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గంలోని వనపర్తి, అలంపూర్, గద్వాల సెగ్మెంట్‌లకు ఎన్నికల వ్యయ పరిశీలకు లుగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించగా ఆయన మంగళవారం జోగుళాంబ గద్వాల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శశాంకను కలిశారు. ఆయనకు పూలబొకేతో కలెక్టర్ ఆహ్వానం పలికారు. అనంతరం కలెక్టర్ చాంబర్‌లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పలు విషయాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఫ్లయింగ్‌స్కాడ్, స్టాటికల్ బృందాలను ఎక్కడెక్కడ నియమించా రని అడిగి తెలుసుకున్నారు. సభలు, సమా వేశాలను వీడియో తీసి ఖర్చులను ఎప్పటి కప్పుడు వారి ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు గురి చేసి మద్యం, డబ్బు పంపిణీ ఇతర వాటిపై గట్టి నిఘా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నిరంజన్, ఆర్డీవో రాములు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...