మొదటి రోజు నామినేషన్లు నిల్


Tue,March 19, 2019 02:42 AM

-రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శ్రీధర్
నాగర్‌కర్నూల్ టౌన్ : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ సందర్భంగా మొదటిరోజు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికలకు మొదటి నోటిఫికేషన్ సోమవారం విడుదలైన నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని, ఉదయం అభ్యర్థి తమ నామినేషన్లను ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటరి నియోజకవర్గానికి నామినేషన్లు స్వీకరిస్తున్నామన్నారు. మొదటి రోజు సోమవారం ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపారు. పని దినాల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామని, సెలువు దినాల్లో నామినేషన్లు స్వీకరించడం జరిగదని సూచించారు. మార్చి 21న హోలి, 23న నాల్గవ శనివారం, 24న ఆదివారం ఉన్నందున ఆయా రోజుల్లో నామినేషన్లు స్వీకరించబడవని, అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...