సమయపాలన పాటించాలి


Tue,March 19, 2019 02:41 AM

-జిల్లాలో ఎన్నికల విధులను సమర్థంగా నిర్వహించండి
-విధుల పట్ల అలసత్వం వీడాలి
-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్
-కలెక్టరేట్‌లో ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం
నాగర్‌కర్నూల్ టౌన్ : పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా అధికారులు సమయపాలన పాటించాల్సిన అవసరం ఎంతై నా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్‌లో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారులు ఎన్నికల విధులలో అలసత్వం వహించరాదన్నారు. అనుమతి లేకుండా ఏ అధికారి కూడా జిల్లాను విడిచి వెళ్లరాదని ఆదేశించారు. ఎన్నికల విషయంలో ప్రతి నిమిషం ఎంతో ముఖ్యమైందని, దీనిని జిల్లా అధికారులు గుర్తించి అందుబాటులో ఉండాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదటి రోజున నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొందరు అధికారుల తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదీనంలో పనిచేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఉ ద్యోగులంతా పని చేసేందుకు సంసిద్దమై ఉండాలన్నారు.

ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగస్తులంతా వారి సొంత నియోజకవర్గాల్లో విధులు నిర్వహిస్తున్నట్లయితే ఫాం 12ఎ మరియు ఇతర నియోజకవర్గాల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఫాం12 నమోదు చేసి వాటితో పాటు ఎన్నికల ఉత్తర్వులను జతపరిచి ఈనెల 24లోగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగసులు వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారుల దగ్గర పనిచేసే ప్రైవేట్ డ్రైవర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా అధికారులు సంతకాలు చేసి ఫామ్ 12ఏ, ఫామ్ 12ను అందించవచ్చన్నారు. ఎన్నికల ఉత్తర్వులు అందుకున్న ఉద్యోగస్తులు అందరు ఎన్నికల విధులకు తప్పనిసరిగ్గా హాజరుకావాలని, విధుల మినహాయింపులు ఎవరికి లేవని స్పష్టం చేశారు.

విధులకు హాజరుకాకుంటే వారిపై భారత ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని 792 కేంద్రాలకు సంబంధించి 1900 మంది ఉద్యోగస్తులకు ఈనెల 24న ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా నిర్వహించే ఎన్నికల శిక్షణ తరగతులకు విధిగా హాజరు కావాలన్నారు. శిక్షణ తరగతులకు హాజరుకాని వారి పేర్ల జాబితాను అందించాలని నోడల్ అధికారి సింగారెడ్డిని ఆదేశించారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికారులు సింగారెడ్డి, అం జిలప్ప, మోహన్‌రెడ్డి, గోవిందరాజులు, ప్రజ్వ ల, బాలమణి, అఖిలేష్‌రెడ్డి, అనిల్‌ప్రకాశ్, సుధాకర్, సుధాకర్‌లాల్, సాయిసుమన్, జయంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...