ఖర్చుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి


Tue,March 19, 2019 02:41 AM

-ఏప్రిల్ 1న అభ్యర్థుల ఖాతాలపై మొదటి విడత తనిఖీ
-లోక్‌సభ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు ఏకే. మోరియా
-నియోజవకర్గాల ఎక్స్‌పెండేచర్ మానిటరింగ్ కమిటీలతో సమీక్ష
నాగర్‌కర్నూల్ టౌన్ : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఖర్చుల పూర్తి వివరాలను క్షు ణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు ఏకే.మోరియా అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్‌లో కలెక్టర్ శ్రీధర్‌ను కలిసారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అసెంబ్లీ నియోజవకర్గాల ఎక్స్‌పెండెంచర్ మానిటరింగ్ కమిటీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల ను ఒక బృందంగా ఏర్పడి నిర్వహించాలన్నారు. విధుల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిరి పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. అందుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తానన్నారు. సహాయ ఎక్స్‌పండెంచర్ అధికారులు, వీడియో సర్వేలెన్స్, వీడియో వీ వింగ్, లెక్కల నిర్వాహణ బృందాలు వాటి విధులు తదితర అంశాలన్నింటినీ ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంక్‌లో నగదు విత్‌డ్రా, జమచేసిన అనుమానస్పద బ్యాంక్ ఖాతాలపై పూర్తి నిఘా ఉంచాలన్నారు. ఏప్రిల్ 1న అభ్యర్థులకు సంబంధించి బ్యాంక్ ఖాతాలపై మొదటి తనిఖీ ఉంటుందన్నారు. సమావేశంలో నోడల్ అధికారి నూతనకంటి వెంకట్, అదనపు ఎస్పీ చెన్నయ్య, అచ్చంపేట, కొల్లాపూర్ ఏఆర్‌వోలు, ఆర్డీవోలు పాండు, హనుమానాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఎన్నికల వ్యయ పరిశీలకులుగా
ఏ.కె మోరియా : కలెక్టర్
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఏ.కె మోరియాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. 2014 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఏకే మోరియా కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన వారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చులకు సంబంధించిన లెక్కలు, రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేస్తారని వెల్లడించారు. అంతకుముందు నాగర్‌కర్నూల్‌కు వచ్చిన రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఏకే.మోరియాకు డీఆర్వో మధుసూదన్‌నాయక్ కలెక్టరెట్ వద్ద పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...