పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు


Tue,March 19, 2019 02:41 AM

-హర్యానా, హిమాచల్ ప్రదేశ్ పోలీసులతో బందోబస్తు
-కలెక్టరేట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు
-వంద మీటర్ల దూరంలో హద్దులు
నాగర్‌కర్నూల్ క్రైం: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రమైన కలెక్టరేట్ వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టరేట్‌కు ఇరువైపున ప్రధాన రహదారికి 100 మీటర్ల వరకు హద్దులు పెట్టి సున్నంతో మార్కింగ్ వేశారు. ప్రైవేట్ వ్యక్తులు వాహనాలు రాకుండా ముందు భాగంలో బారికేట్లను కట్టారు. ప్రైవేట్ వాహనాలు నిలుపరాదని ప్రత్యేకంగా బ్యానర్లను ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతోపాటు హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పోలీసులను కేంద్ర ఎన్నికల సంఘం బందోబస్తును ఏర్పాటు చేశారు. సోమవారం మొదటిరోజు ఎలాంటి నామినేషన్లు రాకపోయినా బందోబస్తు విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కార్యాలయాలకు చెందిన వాహనాలను మినహా ఏఒక్క వాహనాన్ని బారికేట్ల లోపలికి అనుమతించలేదు. కలెక్టరేట్‌లోనూ నామినేషన్లు స్వీకరించే హాల్ వద్ద సైతం బారికేట్లను ఏర్పాటు చేసి హర్యానా పోలీసులను బందోబస్తుగా ఉంచారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...