అచ్చంపేటలో స్కానింగ్ సెంటర్ సీజ్


Tue,March 19, 2019 02:40 AM

-అర్హత లేని వైద్యులతో స్కానింగ్ పరీక్షలు నేరం
-జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతాం: డీఎంహెచ్‌వో
అచ్చంపేట రూరల్: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు దవాఖానలు, స్కానింగ్ సెంటర్లు, రక్త పరీక్ష కేంద్రాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా గత ఏడాది పట్టణంలో ఓ స్కానింగ్ కేంద్రం, మూడు అర్శమొలల దవాఖానలు సీజ్ చేసిన సంగతి విధితమే. కాగా సోమవారం పట్టణంలో అనుమతుల్లేకుండా స్కానింగ్‌లు తీస్తున్న ఓ దవాఖానలోని స్కానింగ్ సెంటర్‌ను జిల్లా వైధ్యాధికారి దశరథ్ సీజ్ చేశారు. మంగళవారం తహసీల్దారు చెన్నకిష్టన్న, ఎస్సై పరశురాం సమక్షంలో తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి బృందం స్కానింగ్ మిషన్ లను, స్కానింగ్ గది, రికార్డులను సీజ్ చేసింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2017 నుంచి అనుమతులు లేకుండా కొనసాగిస్తున్న పురాతన స్కానింగ్ యంత్రాన్ని పరిశీలించి సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. గత నెల 26న బీకే తిర్మలాపూర్‌కు చెందిన గర్భిణీ పోలమ్మ పట్టణంలోని సర్రాం దవాఖానలో స్కానింగ్ చేసుకోవడంతోనే శిశువు మృతిచెందిన విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, వివరాలు సేకరించి సీజ్ చేసినట్లు తెలిపారు. దవాఖానలో స్కానింగ్ చేయాలంటే గైనకాలజిస్టు, సైకాలజిస్టు, రేడియాలజిస్టు అర్హత పొంది ఉండాలన్నారు. అర్హత లేని వైద్యులే స్కానింగ్‌లు తీస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని విడతల వారిగా తనిఖీలు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారి వెంకటదాసు, ప్రోగ్రాం అధికారి మోహనయ్య, తహసీల్దారు చెన్నకిష్టన్న, ఎస్సై పరశురాం వైధ్య సిబ్బంది శ్రీనువాసులు, అశోక్‌ప్రసాద్‌లు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...