16 ఎంపీ సీట్లు గెలుపొందాలి


Mon,March 18, 2019 02:15 AM

-తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
-సంక్షేమ పథకాలకు ఆటంకాలు కలగొద్దు
-వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
-మల్లమ్మ బోనాల ఉత్సవాలకు హాజరు
వనపర్తి రూరల్ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలుపొందేలా ఆశీర్వదించాలని మల్లమ్మ దేవతను కోరినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని చందాపూర్ గ్రామ రహదారిలోని అటవీ ప్రాంతంలో ఉన్న మేదరుల కుల దేవత అయిన మల్లమ్మ బోనాల పండుగ ఉత్సవాలకు ఆదివారం ఆయన హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మల్లమ్మ దేవత అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ చేపట్టిన సం క్షేమ పథకాలకు ఏ ఆటంకాలు కలగకుం డా ముందుకెళ్లాలని కోరానని చెప్పారు. మంత్రి వెంట వనపర్తి మున్సిపాలిటీ చై ర్మన్ రమేష్ గౌడ్, ఎంపీపీ శంకర్‌నాయ క్, లోక్‌నాథ్‌రెడ్డి, శ్రీధర్, గట్టుయాదవ్, తిరుమల్, గొర్రెల కాపరుల సంఘం జి ల్లా చైర్మన్ కురుమూర్తి యాదవ్, రాము, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...