నేటి నుంచి ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్


Mon,March 18, 2019 02:15 AM

-అధ్యాపకులు మహబూబ్‌నగర్‌లో రిపోర్ట్ చేసుకోవాలి
-ఇంటర్‌బోర్డు జిల్లా నోడల్ అధికారి వెంకటరమణ
నాగర్‌కర్నూల్ టౌన్ : ఈనెల 18 నుంచి ఇంటర్మీడియెట్ సబ్జెక్టులకు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ ఉంటుందని ఇంటర్‌బోర్డు నాగర్‌కర్నూల్ జిల్లా నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ కోసం సోమవారం(18.03.19) ఉదయం 10గంటలకు ప్రభుత్వ రెసిడెన్షియల్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు విధిగా రిపోర్టు చేసుకోవాలన్నారు. సదరు అధ్యాపకులు వారి రిపోర్టును మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అందజేయాలని సూచించారు. స్పాట్ వాల్యుయేషన్‌కు వచ్చే అధ్యాపకులను రిలీవ్ చేయని మేనేజ్‌మెంట్లపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కాగా స్పాట్ వాల్యుయేషన్ ఈనెల 22 నుంచి ఉండగా.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 18నుంచి ప్రారంభించినట్లు తెలిపారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...