ఆత్మరక్షణకు కరాటే ముఖ్యం


Mon,March 18, 2019 02:15 AM

ఊర్కొండ : మహిళలు, చిన్నారుల తో పాటు ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు ఇండి యా ఛీప్ కో అర్డినేటర్ నరేందర గౌడ్ అన్నారు. ఆదివారం మండ ల కేంద్రం లో విక్టరీ షోటోకాన్ కరాటే డూ అసోషియోషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పంచ్‌లలో 200మంది బాలికలు 5నిమిషాల 2 సెకండ్లలో 1,50,000 పంచులు ఇవ్వడం ఇండియాలోనే మొదటి రికార్డుగా నమోదైందని కార్యక్రమ నిర్వాహాకులు తెలిపా రు. ఈ సందర్భంగా నరేందర్‌గౌడ్ మా ట్లాడుతూ.. పంచ్‌ల రికార్డుల్లో ప్రపంచంలోనే ఇండియాలోని తెలంగాణ రా ష్ట్రం చరిత్రలో నిచిందని, ఇలాంటి గొ ప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కిరణ్‌నాయక్, మల్లిఖార్జున్‌ను అభినందించారు. ఈ కార్యక్రమ ఏర్పాటుకు సహకరించిన టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జనార్దన్‌రెడ్డి ని నిర్వాహకులు శాలువా తో సన్మానించారు. కార్యక్రమంలో వం డర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎండీ. కోదండపాణి, ఛీప్ ఎగ్జామినర్ అండ్ టెక్నికల్ డైరెక్టర్ మల్లిఖార్జున్‌గౌడ్ ఎస్సై కృష్ణయ్య, సర్పంచ్ రాజయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...