వేసవి సెలవుల్లో యువవిజ్ఞాన కార్యక్రమం


Sun,March 17, 2019 02:38 AM

- డీఈవో గోవిందరాజులు
నాగర్‌కర్నూల్ టౌన్ : ఈ వేసవి సెలువుల్లో 9వ తరగతి విద్యార్థులకు యువ విజ్ఞాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈవో గోవిందరాజులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఐఎస్‌ఆర్‌వో) వారు ప్రభుత్వం సంకల్పించిన జై విజ్ఞాన్, జై అనుసంధాన కార్యక్రమంలో భాగంగా యువ విజ్ఞాన కార్యక్రమం పేరిట ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అంతరిక్షం మరియు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవగాహన కల్పించడానికి వేసవి సెలువుల్లో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ శిబిరాల్లో ప్రముఖ శాస్త్రవేత్త చేత ప్రసంగాలు, చర్చలు, విజ్ఞాన సంస్థ సందర్శన మొదలగు కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు విద్యార్థుల గణిత, శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్ రంగాల్లో మక్కువ పెంచుకోడానికి పరిశోధన వైపు ప్రోత్సహించుటకు సదరు కార్యక్రమం ఏర్పాటు చేయబడిందన్నారు. కార్యక్రమానికి మన జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులను రాష్ట్ర స్థాయికి పంపాలని, దీనికోసం 8వ తరగతిలో వచ్చిన మార్కుల శాతం సైన్స్ కార్యక్రమాల్లో జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో పాల్గొన్న విషయాలు, క్రీడల విషయాలు, స్కౌట్స్ అండర్ గైడ్స్ మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. వివరాలను డీఈవో కార్యాలయంలో 18వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా అందజేయాలన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి 9989921105 సంప్రదించాలన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...