సమావేశాన్ని విజయవంతం చేయండి


Sun,March 17, 2019 02:38 AM

-ఈనెల 18న పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం
-టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ టౌన్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గస్థాయి సమావేశాన్ని ఈ నెల 18వ తేదీన నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో జక్కా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 సీట్లను టీఆర్‌ఎస్ పార్టీయే గెలుచుకుంటుందని, ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ సీట్లను అత్యధిక మెజార్టీతో గెలుపించుకునేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌నెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కూచకుళ్ళ దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుగంటి రాములు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్‌యాదవ్‌లు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈసమావేశానికి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...