అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలి


Sun,March 17, 2019 02:38 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : లోక్‌సభ ఎ న్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరం లో లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు, వివిధ రకాల అనుమతులు, పాటించాల్సిన అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా వివిధ రకాల అనుమతులు, సువిధ ద్వారా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలకు సం బంధించి ఏదైనా సమాచారాన్ని లేదా ఫిర్యాదులను 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియజేవచ్చని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా ఏమైనా అక్రమాలకు సంబంధించి ఫిర్యాదులను సివిజిల్ యాప్ ద్వారా పంపవచ్చని స్పష్టం చేశారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఫారా ల్లో ఫారం 2, ఫారం 26 ముఖ్యమన్నారు. ఫారం 26 అఫిడవిట్‌కు సం బంధించిందని, సవరించిన ఫారం 26లో పాన్‌కార్డు వివరాలు కూడా స మర్పించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ పత్రాలపై ప్రతి పేపర్ పై అభ్యర్థి సంతకం ఉండాలని, ఏ కాలంను ఖాళీ గా వదలరాదన్నారు. అభ్యర్థి నేర చరిత్రకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగ్గా సమర్పించాలని, అలా సమర్పించిన వివరాలు మూడు విడతల్లో ఈనెల 29నుంచి ఏప్రిల్ 8లోపు పత్రికలు, టీవీల్లో ప్రచురించాల్సి ఉంటుందన్నారు. వీటితో పాటు చెల్లించాల్సిన పన్నులు, ఇతరాత్ర ఎలాంటి డ్యూ లేద ని ధ్రువపత్రం సమర్పించాలన్నారు.

సెక్యూరిటీ డిపాజిట్‌గా అభ్యర్థి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయినందున రూ.12,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, నామినేషన్ల సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల వరకు మూడు వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు. రిటర్నింగ్ అధికారి గదిలోకి మాత్రం అభ్యర్థితో పాటు ఐదుగురికి అనుమతి ఉం టుందని, అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి తప్పనిసరిగ్గా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఓటరై ఉండాలన్నా రు. అభ్యర్థి మాత్రం దేశంలో ఎక్కడి నుంచి అయినా ఓటరుగా ఉండవచ్చన్నారు. అభ్యర్థి నామినేషన్ పత్రాలతో పాటు షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇటీవలి రెండు కలర్ పాస్‌ఫొటోలు సమర్పించాలని, మెడపై ఎలాంటి కండువాలు కానీ పార్టీ గుర్తులు కానీ ఉండకూడదని కలెక్టర్ తెలిపారు. నామినేషన్లు ఈనెల 18న ఉదయం 11గంటలకు నోటిఫికేషన్ విడుదల అనంతరం తీసుకోవడం జరుగుతుందన్నారు.

21న హోలి సందర్భంగా 23 శనివా రం, 24న ఆదివారం సందర్భంగా నా మినేషన్లు స్వీకరించడం జరిగదని, ఆయా పార్టీలు, ఎన్నికలల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఓటర్లు ఓటరు జాబితాలో వారి పేరు ఉందో లేదో ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా చూసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు. 9223166166 నెంబర్, టీఎస్ స్పేస్ ఓట్ స్పేస్ ఓటరు ఐడి నెంబర్ టైప్ చేసి మెసేజ్ చేస్తే జాబితాలో పేరు ఉంది లేనిది వస్తుంద ని వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తన ని యమావాళి సివిజిల్, ఈవీఎం, స్ట్రాంగ్ రూం, మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పోలిం గ్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానమిచ్చారు. సమావేశంలో డీఆర్వో మదుసూధన్‌నాయక్, జిల్లా ఆడిట్ ఆఫీసర్ వెంకట్, టీఆర్‌ఎస్ నుంచి చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి డేవిడ్ రాజు, వెం కట్‌రాములు, సీపీఎం నుంచి గీతారా ణి, ఏఐఎంఐఎం నుంచి అలి హుస్సేన్ సయ్యద్, బీజేపీ నుంచి శ్రీనివాస్, టీడీపీ నుంచి బాలరాజు, బీఎస్పీ నుంచి ఆంజనేయులు, వైఎస్సార్‌సీపీ నుంచి సత్యంయాదవ్ పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...