స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందజేయాలి


Sun,March 17, 2019 02:37 AM

నాగర్‌ర్నూల్ రూరల్ : సాంఘిక సంక్షేశాఖ ద్వారా అందజేసే స్కాలర్షిప్‌లను సకాలంలో అందజేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కరుణాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల పరీక్షలు, విద్యార్థుల స్కాలర్షిప్‌ల అందజేతపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి అఖిలేష్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఇంటర్ ఆపై చదువుతున్న విద్యార్థులకు పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్‌ల కోసం జిల్లాకు రూ.7.72 కోట్ల బడ్జెట్ మంజూరైందన్నారు. కాగా, రూ.3.43 కోట్ల బడ్జెట్‌ను విద్యార్థులకు స్కాలర్షిప్‌లకు విడుదల చేశామన్నారు. అదేవిధంగా 5వ తతరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్‌లకు రూ.40 లక్షలు జిల్లాకు మంజూరు కాగా, ఇప్పటి వరకు 390 మంది విద్యార్థులకు స్కాలర్షిప్‌లను విడుదల చేసినట్లు వివరించారు. మిగతా స్కాలర్షిప్‌లు అందజేసే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ వీసీలో రామ్‌లాల్, శ్రీకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...