డయాలసిస్ రోగులు శుభ్రమైన నీరు తాగాలి


Sun,March 17, 2019 02:37 AM

మహబూబ్‌నగర్ (వైద్య విభాగం) : డయాలసిస్ రోగులు విధిగా శుభ్రమైన నీరు మాత్రమే తాగాలనీ, జనరల్ దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ సూచించారు. శనివారం జనరల్ దవాఖానాలోని డయాలసిస్ సెంటర్‌లో నిమ్స్ నెఫ్రాలజీ వైద్యులు డాక్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో ఉచిత డయాలసిస్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ డయాలసిస్ వైద్య శిబిరాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ ప్రారంభించారు. ఈ శిబిరంలో డయాలసిస్ సెంటర్‌లో ఉచితంగా 40 మంది డయాలసిస్ రోగులకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాంకిషన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఊపిరితిత్తుల రోగాల బారిన పడి చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. డయాలసిస్ రోగులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కువ సేపు ఎండలో పనులు చేయకుండా మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోవాలన్నారు. సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఒక సంవత్సరానికి కావాల్సిన మందులు, ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు.ప్రతి సైకిల్ డయాలసిస్‌లో రూ.14,125 వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మెడిసిన్ హెచ్‌వోడి డాక్టర్ నిశాంత్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్, ఆర్‌ఎంఓ డాక్టర్ వంశీకృష్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్ సెల్వి, డీమెయిడ్ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...