జాతీయ పార్టీల శకం ముగిసినట్లే..


Sat,March 16, 2019 02:01 AM

- దేశ రాజకీయాల్లో మార్పు కేసీఆర్‌తోనే సాధ్యం
- రాష్ట్రంలో 16ఎంపీ స్థానాలు గెలుస్తాం
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

అచ్చంపేట రూరల్ : దేశంలో జాతీయ పార్టీల శకం ముగిసినట్లేనని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు దోచుకోవడం దాచుకోవడం తప్ప దేశానికి చేసిందేమీ లేదన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ పథకాలు, అభివృద్ధి పనులను ఆయా రాష్ర్టాలు స్ఫూర్తిగా తీసుకున్నాయని గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో మార్పు కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలవడం ఖాయమని, కేసీఆర్ సారథ్యంలో ఢిల్లీలో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన కేటీఆర్ సన్నాహాక సమావేశంలో ఓటర్లకు మంచి సంకేతాలను ఇవ్వడం జరిగిందని, అదే స్ఫూర్తితో వారంలోపు అచ్చంపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ ప్రజల తలరాతను మార్చనున్నాయని, దీంతో యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి ఎదగుతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల సమావేశం అనంతరం ఎంపీ అభ్యర్థితో కలిసి గ్రామాల్లో పర్యటిస్తారన్నారు. సమావేశంలో రైతు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, ఎంపీపీ పర్వతాలు, మున్సిపల్ చైర్మన్ తులసీరాం, వైస్ చైర్మన్ విశ్వేశ్వర్‌నాథ్, నాయకులు నర్సింహగౌడ్, నర్సింహారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, అమీనోద్దిన్ ఉన్నారు.

ఎడ్మ కిష్టారెడ్డిని పరామర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి
కల్వకుర్తి రూరల్ : కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో పరామర్శించారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై కోలుకోవడంతో ఆయనను మంత్రి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట రాంరెడ్డి, ఎడ్మసత్యం తదితరులు ఉన్నారు.

ఓయూ డిగ్రీ సెమిస్టర్-1లో నల్లమల విద్యార్థి ప్రతిభ
వంగూరు: ఉస్మానియా యూనివర్సిటీ శనివారం ప్రకటించిన డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్-1 ఫలితాల్లో నల్లమల విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచి10/10 పాయింట్లు సాధించింది. వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామానికి చెందిన శిరీష ఉస్మానియా యూనివర్సిటీ పరిదిలోని సిద్దిపేట వర్గల్ మహాత్మా జ్యోతి బాఫూలే రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో చదువుకుంటూ 10/10 పాయింట్లు సాధించడంతో వంగూరు మండలంలో శిరీషను పలువురు ప్రశంసిస్తున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...