పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి


Sat,March 16, 2019 02:00 AM

- చీఫ్ సూపరింటెండెంట్ సీహెచ్ శ్రీనివాసులు
లింగాల : నేటి నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి వార్షీక పరీక్షలను నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్ సీహెచ్ శ్రీనివాసులు, సత్యనారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది పరీక్షా విధులు నిర్వహించే ఇన్విజిలేటర్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 16నుంచి ఏప్రిల్ 2వరకు జరిగే పరీక్షల్లో మాస్ కాపియింగ్‌కు చోటు లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు పాఠశాలల యూనిఫామ్స్‌తో పరీక్షా కేంద్రాలకు రావొద్దని, ఎవరైనా అలా వస్తే ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. 8.45గంటలకు అనుమతి ఇస్తారని 9.35నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రంలో అనుమతించడదన్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్ నిశేదమన్నారు. కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్ అధికారి రవీందర్, లింగారెడ్డి పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...