అచ్చంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా


Sat,March 16, 2019 01:59 AM

అచ్చంపేట, నమస్తే తెలంగాణ : అచ్చంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అ న్నారు. అచ్చంపేట మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి మూడేళ్లు పూర్తైన సందర్భంగా శుక్రవారం కేక్‌కట్ చేసి పాలకవర్గం, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పట్టణంలో నీటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మిషన్‌భగీరథ జలాలను అన్ని ప్రాంతాలకు అం దించి శాశ్వత తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. పట్టణంలో రూ.36 కోట్లతో మిషన్‌భగీరథ ఫథకంలో భాగంగా ఇంటింటికీ నల్లాలు, పైపులైన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కాలనీల్లో మురుగుకాల్వల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నా రు. పట్టణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూ పొందించామన్నారు. అంతకుముందు కౌ న్సిలర్లను శాలువా, పూలమాలతో సత్కరిం చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తులసీరాం, వైస్ చైర్మన్ రాజు, రైతు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ క మిషనర్ వెంకటస్వామి, కౌన్సిలర్లు హన్మం తు, శివ, బాల్‌రాజు, మనోహర్‌ప్రసాద్, నాయకులు నర్సింహ్మగౌడ్, రా జేశ్వర్‌రెడ్డి, నర్సింహ్మరెడ్డి, పర్వతాలు, రమేశ్‌రావు, నర్సింహ్మరెడ్డి, ఉస్సేన్ పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...