ఎన్నికల ఖర్చుపై నిఘా


Sat,March 16, 2019 01:59 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులపై నిరంతరం నిఘా ఉంటుందని ఎన్నికల వ్యయ నోడల్ అధికారి నూతనకంటి వెంకట్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, జోగులాంబ గద్వాల అసెండ్లి సెగ్మెంట్స్ (7)లలో ఎన్నికల ఖర్చులపై కుఠిష్ట నిఘా ఉంచేందుకు గాను 42 మంది ఫ్లయింగ్ స్కాడ్స్, 42 స్టాటిక్ సర్విలెన్స్ టీమ్స్, 14 వీడియో సర్విలెన్స్ టీమ్స్, ఏడు వీడియో ఫ్లయింగ్ స్కాడ్స్, ఏడు అకౌంటింగ్ టీమ్స్, 8 మంది అసిస్టెంట్ అబ్జర్వర్లను నియమించడం జరిగిందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలలో పోటి చేసే అభ్యర్థి గరిష్టంగా 70లక్షలకు మించకూడదని, ఒకవేళ మించితే గెలిచినా కూడా అనర్హత వేటు వేయబడుతుందని పేర్కొన్నారు. సమావేశంలో శ్రీరామ్, రవీందర్, మన్సూర్, రఘుచారి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...