పది పరీక్షలకు సిద్ధం


Fri,March 15, 2019 02:01 AM

-హాజరుకానున్న 11,509 మంది విద్యార్థులు
-52 కేంద్రాల్లో పరీక్షలు.. 575 మందితో విధులు
-హాల్ టిక్కెట్లు చూపిస్తే బస్సుల్లో ఉచిత ప్రయాణం
-పదికి ఒక్క నిమిషం నిబంధన వర్తించదు
- ఏఎన్‌ఎం, ఓఆర్‌ఎస్ పాకెట్లు, మంచి నీళ్లు అందుబాటులో..
-ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు
-నమస్తే తెలంగాణతో డీఈవో గోవిందరాజులు
నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది. జిల్లాలో 11,508 మంది విద్యార్థులు 52కేంద్రాల ద్వారా పరీక్షలకు హాజరుఅవుతున్నారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే, దానికి ప్రోత్సహిస్తే శాఖా పర ంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెబుతున్నారు నాగర్‌కర్నూల్ జిల్లా విద్యా శాఖాధికారి. రేపటి నుంచి జిల్లాలో ప్రారంభం కాబోతున్న పదో తరగతి పరీక్షల గురించి డీఈవో గోవిందరాజులు నమస్తే తెలంగాణకు వివరించారు.
నమస్తే తెలంగాణ : జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారా..?
డీఈవో: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు నెల కిందటి నుంచే చేపడుతూ వచ్చా ం. జిల్లాలోని 52పరీక్షా కేంద్రాల్లో గదుల్లో వెంటిలేషన్, మరుగుదొ డ్లు, మూత్ర శాళలతో పాటుగా విద్యుత్, మం చినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకు న్నా ం. వేసవిని దృష్టిలో ఉం చుకొని ఏఎన్‌ఎం సిబ్బందిని, ఓఆర్‌ఎస్ పాకెట్లను కూడా అందుబాటులో ఉ ంచుతున్నాం.
నమస్తే తెలంగాణ : ఎంత మంది పరీక్షలకు హాజరు కానున్నారు..?
డీఈవో: జిల్లాలో మొత్తం 11,509మంది పరీక్షలు ఈసారి పరీక్షలు రాస్తున్నారు. ఇందులో 10,80 8మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 701మంది ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరవుతున్నారు. రెగ్యులర్ విద్యార్థులకు 50పరీక్షా కేంద్రాలు, ప్రైవేట్ విద్యార్థులకు 2కేంద్రాలను ఏర్పా టు చేశాం. ఇప్పటికే విద్యార్థులందరికీ హాల్ టిక్కెట్లు అందించడం పూర్తయ్యింది.
నమస్తే తెలంగాణ : పదికి ఒక్క నిమిషం నిబంధన ఉందా..?
డీఈవో: పది పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి ప్రతీ రోజు ఉదయం 9:45గంటల నుంచి మధ్యాహ్నం 12:15గంటల వరకు ఉంటాయి. పదో తరగతి విద్యార్థులకు ఒక్క నిమిషం నిబంధన లేదు. పరీక్ష ప్రారంభమయ్యాక 5నిమిషాల వరకు మాత్రం పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. అందుకు విద్యార్థులు ఉదయం 9:30గంటల వరకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
నమస్తే తెలంగాణ : గ్రామీణ విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు కలిగే ఇబ్బందులను తొలగించే చర్యలు తీసుకున్నారా..?
డీఈవో: ప్రతి గ్రామం నుంచి పరీక్షా సమయానికి బస్సులు నడిచేలా ఆర్టీసీ అధికారులతో మాట్లాడటం జరిగింది. హాల్ టిక్కెట్లు చూపించిన విద్యార్థులను ఆయా పరీక్షా కేంద్రాల ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా అనుమతి ఇస్తారు. కనుక విద్యార్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతశాతం పెంచేందుకు తీసుకున్న చర్యలు?
డీఈవో: ప్రభుత్వ పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత కోసం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాం. వెనకబడిన విద్యార్థులపై కూడా దృష్టి సారించాం. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ బృందం సహకారంతో ప్రైవేట్ కంటే అధికంగా ఉత్తీర్ణత శాతం వచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగింది.
నమస్తే తెలంగాణ : పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా...?
డీఈవో: విద్యార్థులు పరీక్షలని కొత్తగా భయం పెంచుకోవద్దు. సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. తల్లిదండ్రులు కూడా పరీక్షల పేరుతో ఆందోళనకు గురి చేయవద్దు. ఇప్పటి వరకూ పాఠశాలల్లో హాజరైనట్లుగా ఒత్తిడి లేకుండా రాయాలి. తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాస్తూ సమయాన్ని ఆదా చేసుకోవాలి.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...