ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి


Fri,March 15, 2019 01:59 AM

బిజినేపల్లి : చునావ్ పాఠశాల కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని డీఈవో గోవిందరాజులు అన్నారు. మండలంలోని పాలెం గ్రామంలోని తోటపల్లి సుబ్రమణ్య మెమోరియల్, ఎయిడెడ్ పాఠశాలలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకువచ్చేలా చూడాలని, హాజరుశాతం పెంచాలన్నారు. సమయపాలన పాటించాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అదేవిధంగా బిజినేపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన చునావ్ పాఠశాల కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఉపయోగించే వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్ల పనితీరుపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. రానున్న పార్లమెంట్ విధులకు హజరయ్యే ఉపాధ్యాయులు ఎలాంటి పొరపాట్లను చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం బిజినేపల్లి పోలిస్‌స్టేషన్‌లో పదో తరగతి ప్రశ్నా పత్రాల డిపాటిట్ చేసే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...