పరిశోధన ఫలితాలు రైతులకు చేరాలి


Fri,March 15, 2019 01:59 AM

-తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు
బిజినేపల్లి : పరిశోధన ఫలితాలు క్షేత్ర స్థాయిలో ఉన్న రైతులకు చేరే లా చూడాలని శాస్త్రవేత్తలకు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు అన్నా రు. గురువారం మండలంలోని పాలెం గ్రామంలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం, కేవీకేలో శాస్త్రీయ సలహా సం ఘం సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో గత సంవత్సరం చేపట్టిన కార్యక్రమాలు, 2019-20 సంవత్సరంలో చేయాల్సిన కార్యచరణ ప్రణాళికలు రూపొందించబడ్డాయన్నారు. గతంలో శాస్త్రవేత్తలు చేపట్టిన కార్యక్రమంలో ప్రశంసించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పప్పు దినుసుల పంటల్లో విత్తనోత్పత్తి రైతులకు అందించాలని ఆయన సూచించారు. అనంతరం వీసీ ప్రవీణ్‌రావును వ్యవసాయ శాస్త్రవేత్తలు సన్మానించారు. కార్యక్రమంలో విస్తరణ విభాగం అధిపతి రాజిరెడ్డి, ఏడీఆర్ ప్రసాద్, డీఏవో సింగారెడ్డి, చంద్రశేఖర్, కేవీకే కో ఆర్డినేటర్ జగన్మోహన్‌రెడ్డితోపాటు పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...