16 పార్లమెంట్ స్థానాలు టీఆర్‌ఎస్‌వే..


Fri,March 15, 2019 01:55 AM

-మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి
-టీఆర్‌ఎస్‌లో చేరిన సర్పంచులు, 300 మంది కార్యకర్తలు
కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 16 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం రంగవరం గ్రామ సర్పంచ్ జయసుధ, ఉపసర్పంచ్ హర్షవర్దన్‌రెడ్డితో పాటు వార్డు సభ్యులతో పాటు మరో 30మంది కార్యకర్తలు గురువారం సాయంత్రం కొల్లాపూర్ టీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జూపల్లి సమక్షంలో చేరారు. వీరందరికీ గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వంలో గత నాల్గున్నరేళ్ల కాలంలో చేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా చేపట్టని విధంగా అమలు చేస్తున్నారన్నారు. సాగు, తాగునీరు, వ్యవసాయరంగానికి 24గంటల ఉచిత కరెంట్, రైతుకు పెట్టుబడి, రైతుబంధు, ఆసరా ఫించన్లు, పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అనేక సంక్షేమ పథకాలను చేపట్టడం మూలంగానే ప్రజల హృదయాల్లో కేసీఆర్ ప్రభుత్వం చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకుందని పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లువేసి భారీ మెజార్టీతో గెలిపించనున్నారని, వనపర్తిలో జరిగిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సభకు ప్రజలు తరలిరావడమే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమలేశ్వర్‌రావు, సింగిల్ విండో చైర్మన్ బాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు ఎద్దుల సురేందర్‌రెడ్డి, స్థానిక ఎంపీపీ చిన్ననిరంజన్‌రావు, నాయకులు సిబ్బేది నర్సింహారావు, బాలస్వరూప్, బొరెల్లి మహేశ్ తదితరులున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...