ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలి


Fri,March 15, 2019 01:55 AM

-ఆన్ గోయింగ్ వర్క్స్‌పై దృష్టి సారించండి
-హరితహారం కార్యక్రమం నాటికి మొక్కలు సిద్ధం చేయండి
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి
- ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం:కలెక్టర్ శ్రీధర్
- పార్లమెంట్ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్
నాగర్‌కర్నూల్ టౌన్ : త్వరలో నిర్వహించే పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి ఎస్.కె.జోషి సూచించా రు. గురువారం జిల్లా కలెక్టర్లతో హరితహారం, మోడల్ కోడ్ కండక్టు ఆఫ్ ఎ లక్షన్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పనులు నిర్వహించకుండా ఆన్ గోయింగ్ వర్క్స్ ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందు నిర్వహించే పనులను కొనసాగించాలన్నా రు. కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనుల ను నిర్వహించరాదని కలెక్టర్లకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. జూ న్ మాసంలో నిర్వహించే హరితహారం పై జిల్లాలో నర్సరీలలో వివిధ రకాల మొక్కల పెంపకాన్ని కొనసాగించి హరితహారం కార్యక్రమం నాటికి అందించాలని సూచించారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ డంపింగ్ యాడ్‌లను అన్ని గ్రామ పంచాయతీల్లో, పట్టణా ల్లో ఘన వ్యర్థ పదార్ధాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. ఘన వ్యర్థ పదార్ధాల ద్వారా సేం ద్రియ ఎరువులను తయారు విధానా న్ని అమలు పరిచి రైతుల పంట పొలాలకు వినియోగించుకొనేలా ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీరు, ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.

ఏర్పాట్లు చేస్తున్నాం : కలెక్టర్
పార్లమెంట్ ఎన్నికల నిర్వాహణ కోసం ఏర్పాట్లు కపడ్భందీగా చేస్తున్నామని వీసీ ద్వారా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి కలెక్టర్ శ్రీధర్ వివరించారు. ఉద్యోగుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని, ఆన్ గోయింగ్ వర్క్స్‌పై ఎన్నికల సంఘానికి ఇదివరకే నివేదించామన్నారు. ఘన వ్యర్థపర్ధాల దండపింగ్ యార్డులను అ న్ని గ్రామాల్లో నిర్వహించి వాటిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో 354 గ్రామీణ అభివృద్ధిశాఖ, 69 అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో 2 కోట్ల 88 లక్షల వివిధ రకాల మొక్కలను పెంచుతున్నట్లు కలెక్టర్ వివరించారు. వేసవిలో తాగునీటి సమస్యల తలెత్తకుండా సంబంధిత అధికారులు ఇదివరకే ప్రణాళికలు రూపొందించాలని వి వరించారు. వీడియో కాన్ఫరెన్సలో జి ల్లా అటవీశాఖాధికారి జోజి, గ్రామీణాభివృద్ధి శాఖాధికారి సుధాకర్, ఇతర జి ల్లా అధికారులు చంద్రశేఖర్‌రావు, మో హన్‌రెడ్డి, అనిల్‌ప్రకాశ్, సుధాకర్‌రెడ్డి, దశరథ్‌నాయక్, రజిని, సురేశ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

అభయాంజనేయుడి హుండీ లెక్కింపు
ఊర్కొండ : మండలంలోని ఊర్కొండపేట శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో గల హుండీని గురువారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వినాందరి ఆధ్వర్యంలో లెక్కించా రు. గత సంవత్సరం ఆగస్టు నుంచి నేటి వరకు గ ల హుండీ లెక్కించగా, రూ.11లక్షల 85,290లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో.రామేశ్వరశర్మ, సర్పంచ్ ఆనితానాగోజీ, ఆ లయ మాజీ చైర్మన్‌లు ప్రకాశ్‌గుప్తా, నర్సిరెడ్డి, స భ్యులు గోవర్దన్, వెంకటేశ్, చంద్రమౌళి, గ్రామస్తులు యాదయ్యగౌడ్, శ్రీనివాసులు, మల్లేశ్‌గౌడ్, శ్రీరాములు, అర్చకులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...