నేడూ దరఖాస్తులు స్వీకరించాలి


Fri,March 15, 2019 01:55 AM

-ఓటరు జాబితాలో పేర్లు నమోదు అయ్యేలా చూడండి
-కలెక్టర్ శ్రీధర్
-ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీసీ
నాగర్‌కర్నూల్ టౌన్ : నేటి వరకు ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకునే వారి పేర్లను జాబితాలో నమోదు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రం నుంచి తహసీల్దార్లు, ఆర్డీవోలతో పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శ్రీధర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ వరకు వచ్చే ఫామ్-6 దరఖాస్తులపై పూర్తి విచారణ జరిపించి ఓటరు జాబితాలో వారి పేర్లు నమోదు చేసేలా అందరూ తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో పీడబ్ల్యుడీ ప్రత్యేక అవసరాలు గల వారి ఓట్లను గుర్తించేలా ప్ర త్యేక మార్కును నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 1400 ఓట్లు కల పోలింగ్ కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లో 1100 ఓట్లు గల పోలింగ్ కేంద్రాలను గుర్తించి నేటి సాయంత్రానికి వాటి జాబితాను రూపొందించి కలెక్టర్ కార్యాలయానికి చేరవేయాలని తహసీల్దార్లను, ఆర్డీవోలను ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు ఈవీఎంలపై అవగాహన కార్యక్రమాల కోసం చేపడుతున్న చూనావ్ పాఠశాల కార్యక్రమాల్లో ఓటర్లను భాగస్వామ్యులను చేసి వీవీ ప్యాట్ యంత్రాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ప్రతిరోజు కొనసాగించాలన్నారు. మండలాల పరిధి పోలింగ్ స్టేషన్లలో చునావ్ పాఠశాల కార్యక్రమాలకు తహసీల్దార్లు, ఆర్డీవోలు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, కలెక్టరేట్ ఎన్నికల తహసీల్దార్ జాకీర్‌అలీ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...