విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి


Thu,March 14, 2019 02:03 AM

- చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలి : కలెక్టర్ శ్రీధర్
- ఘనంగా మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవం
నాగర్‌కర్నూల్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక రం గాల్లో ప్రావీణ్యం సంపాదించాలని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని సాయిగార్డెన్‌లో నిర్వహించిన మండల స్థాయి ప్ర భుత్వ పాఠశాలల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతోపాటు సాంస్కృతిక, క్రీడా పోటీల్లో ఉపాధ్యాయులు ప్రావీణ్యత కల్పించాలని కోరారు.

విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే చదువుపై అభిలాష కలిగేలా వినూత్న కార్యక్రమాలు పాఠశాల, మండల స్థాయిలో నిర్వహించి విద్యార్థికి ప్రేరణను కల్పించాలన్నారు. సాం స్కృతిక మరియు క్రీడా పోటీల్లో పా ల్గొనే విద్యార్థులు సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు వీలుంటుందన్నారు. అందుకు ప్రతి పాఠశాలలో రోజు కనీసం గంట క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని, క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు శారీరక, ధృఢత్వంతో పాటు మానసికంగా అభివృద్ధి చెందుతారన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఈ విధమైన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని కలెక్టర్ అభినందించారు. ఈనెల 11వ తేదీన 4, 5వ తరగతి విద్యార్థులకు గణిత, పరిసరాల విజ్ఞానంపై నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, రాజశేఖర్‌రావు, ఎంఈవోలు జయశ్రీ, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆయిషా ఫాతిమా, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లుశెట్టి, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఎస్‌జీఎఫ్ సెక్రెటరి ప్రసాద్‌గౌడ్, ఎమ్‌ఐఎస్ కో ఆర్డినేటర్ రాఘవేందర్, మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...