సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి


Thu,March 14, 2019 02:03 AM

- ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్
- కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
- అన్ని చర్యలు తీసుకుంటున్నాం : కలెక్టర్, ఎస్పీ
నాగర్‌కర్నూల్ టౌన్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్‌కుమార్ సూచించారు. బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీసీలో నాగర్‌కర్నూల్ నుంచి కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై గట్టి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అన్ని చర్యలు తీసుకుంటున్నాం : కలెక్టర్, ఎస్పీ
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 142 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో గల సమస్యాత్మక గ్రామాలపై గట్టి నిఘా పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ వివరించారు. సంబంధిత రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి నివారణ చర్యలు చేపడతామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించి స మస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రశాం త వాతావరణంలో పోలింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ శ్రీధర్ వివరించారు. వీసీలో అదనపు ఎస్పీ చెన్నయ్య, లోక్‌సభ ఎన్నికల జిల్లా నోడల్ అధికారులు శ్రీరాములు, వెంకటేశ్వర్లు, మోహన్‌రెడ్డి, సురేశ్‌మోహన్, ప్రజ్వల, అఖిలేశ్‌రెడ్డి, అనిల్‌ప్రకాశ్, సీఐ నాగరాజు, గిరికుమార్, కలెక్టరేట్ ఎన్నికల అధికారి జాకీర్‌అలీ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...